Homeతెలంగాణ‘రెట్రో ఫొటో ట్రెండ్‌’పై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల హెచ్చరిక.. వ్యక్తిగత ఫొటోలు షేర్‌ చేయొద్దని సూచన

‘రెట్రో ఫొటో ట్రెండ్‌’పై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల హెచ్చరిక.. వ్యక్తిగత ఫొటోలు షేర్‌ చేయొద్దని సూచన

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ‘1980s/Retro Photo Trend’ విషయంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ ట్రెండ్‌ పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను ఓపెన్‌ చేయడం లేదా డౌన్‌లోడ్‌ చేయడం చేయొద్దని సూచించారు.

రెట్రో లుక్‌లో ఫొటోలు మార్చుకునేందుకు తెలియని యాప్‌లు లేదా వెబ్‌సైట్లను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే అందులోని వ్యక్తిగత ఫొటోలు, ఇతర కీలక సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నకిలీ ఫొటోలు, వీడియోలు రూపొందించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం వాటిని చూపించి బెదిరింపులకు పాల్పడటం లేదా దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అందువల్ల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ప్రతి లింక్‌ను నమ్మకుండా, వ్యక్తిగత ఫొటోలు, వివరాలను తెలియని యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు.

also read: పోక్సో కేసులో అరెస్టైన ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య.. రూ.20 లక్షలు డిమాండ్ చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు