ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్లో తన కెరీర్‌కు సంబంధించిన కీలక విషయాలపై భావోద్వేగంగా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తనకు సినీ, టెలివిజన్ రంగాల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేపథ్యంతో సినిమాలు వస్తున్నప్పటికీ.. కేవలం తెలంగాణకు చెందిన వ్యక్తిగా ఉండటం వల్ల అవకాశాలు దక్కవని ఆమె వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు తాను బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు, ఈవెంట్లు చేసిన విషయాన్ని ఉదయభాను గుర్తుచేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత స్థానికంగా ఉండటం తన కెరీర్‌కు ఎలాంటి అదనపు ప్రయోజనం ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కొన్ని అధికారిక సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తనకు యాంకర్‌గా అవకాశం రాలేదని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు తనకు లభించిన ప్రయోజనం ఏమీ లేదనే భావనను ఆమె వ్యక్తం చేశారు.
తనకు ఉన్న ప్రతిభ, దేవుడు ఇచ్చిన టాలెంట్‌తోనే ఇన్నేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నానని ఉదయభాను చెప్పారు. సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ.. తనకు నచ్చిన స్థాయిలో కథ, పాత్ర లేకపోవడంతో వాటిని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
సీనియర్ నటుడు రాజశేఖర్ నటించిన ఓ సినిమాలో పాట చేసిన తర్వాత తనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె వెల్లడించారు. అయితే తాను పెట్టుకున్న కొన్ని వ్యక్తిగత పరిమితులు, నిబంధనల కారణంగా వాటిలో చాలావాటిని అంగీకరించలేదని వివరించారు.
ప్రస్తుతం నటన కంటే సినీ నిర్మాణ రంగంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు ఉదయభాను తెలిపారు. కొత్తగా వస్తున్న ప్రతిభను ప్రోత్సహించాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అయితే నటనకు పూర్తిగా దూరం కాలేదని స్పష్టం చేశారు. తనను నిజంగా ఆకట్టుకునే కథ, పాత్ర లభిస్తే మళ్లీ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఉదయభాను పేర్కొన్నారు.
also read: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. అల్లుడి హత్యపై నిందితుడి అంగీకారం!
