క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రవల్లి ప్రాంతంలో ‘శుద్ధి’ పేరుతో కేసీఆర్ దళితులను తీవ్రంగా అవమానించారని, ఇది క్షమించరాని చర్య అని ధ్వజమెత్తారు. దళిత వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ కుటుంబాన్ని సమాజం మొత్తం సామాజికంగా బహిష్కరించాలని సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.అంతేకాకుండా, అసెంబ్లీ తొలి రోజున సభ ప్రాంగణం ఎదుట చోటుచేసుకున్న ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించింది. ఈ పరిణామాలపై పూర్తిస్థాయిలో ప్రత్యేక విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణాధికారిగా విజయ్ కుమార్‌ను నియమిస్తున్నట్లు శాసనసభలో అధికారికంగా ప్రకటించారు.
ఈ కుట్ర వెనుక ఉన్న అసలు బాధ్యులను, సూత్రధారులను క్షుణ్ణంగా విచారించి కోర్టు ముందు నిలబెడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ప్రభాస్ ‘ఫౌజీ’కి అదిరిపోయే అప్‌డేట్.. యాక్షన్ సీన్లపై హాలీవుడ్ స్థాయిలో వర్క్!
