క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పారు.పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకు కేటాయించిన పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపించారు. మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా, అలాగే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పరిషత్ (ZP) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుండి మంచి పట్టు, బలమైన అనుచరగణం ఉన్న నాయకుడు వైఎస్సార్సీపీని వీడటం ఆ పార్టీకి తీవ్ర లోటుగానే భావించవచ్చు. అయితే, తన తదుపరి రాజకీయ అడుగుల గురించి మజ్జి శ్రీను ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
చికిత్స కోసం పట్టుకోబోతే.. అధికారులకే చుక్కలు చూపించిన చిరుత
