వృద్ధులు మరియు అనాథ పిల్లల సంక్షేమం పేరిట సాగుతున్న నకిలీ ఛారిటీల వ్యాపారం ఇటీవల కాలంలో తీవ్ర రూపం దాలుస్తోంది. వాట్సప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ఆర్థిక సాయం కోరుతూ వస్తున్న ప్రతిపాదనలను నమ్మి ఉదారంగా స్పందిస్తున్న ప్రజలు దారుణంగా మోసపోతున్నారు. పేదల ఆకలి తీరుస్తామని, బాధితులకు వైద్య సాయం అందిస్తామని నెపంతో కొందరు అక్రమార్కులు విరాళాలు సేకరించి, ఆ నిధులను సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నకిలీ సంస్థల దందా కారణంగా సమాజంలో నిజాయితీగా సేవ అందిస్తున్న అసలైన స్వచ్ఛంద సంస్థలకు దాతల నుంచి సాయం అందకుండా పోతోంది. ఇలాంటి మోసాల భయంతో దాతలు నిజమైన బాధితులకు కూడా సాయం చేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. నేడు ‘అంతర్జాతీయ ఛారిటీ డే’ జరుపుకుంటున్న నేపథ్యంలో, ప్రజల దాతృత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి సైబర్ ముఠాలు మరియు నకిలీ ట్రస్టులపై ప్రభుత్వం, సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో, దాతలు కూడా విరాళాలు ఇచ్చేముందు ఆయా సంస్థల గుర్తింపును పరిశీలించుకోవాలని కోరుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే: ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
కొన్ని సినిమాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి: సినీ నటుడు సుమన్ ఆందోళన
