Homeక్రైమ్మైనర్‌పై లైంగిక దాడి.. ఇద్దరు ఆటో డ్రైవర్ల అరెస్ట్‌

మైనర్‌పై లైంగిక దాడి.. ఇద్దరు ఆటో డ్రైవర్ల అరెస్ట్‌

క్రైమ్ మిర్రర్ : పాతబస్తీ పరిధిలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఘటనపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన బాలిక బార్కస్‌లోని ఓ ఇంట్లో సహాయకురాలిగా పనిచేస్తోంది. రోజువారీగా పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో ఆమె ఆటోలో ప్రయాణిస్తుండేది.

ఈ క్రమంలో ఇద్దరు ఆటో డ్రైవర్లు బాలికను గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా మరో ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం బాలిక కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
also read : జమ్మూలో పాక్‌ చొరబాటుదారుడి అరెస్ట్‌.. భద్రతా దళాల అప్రమత్తత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు