Homeసినిమా‘ఇరుముడి’ జోరు.. రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ సినిమా!

‘ఇరుముడి’ జోరు.. రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ సినిమా!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. విడుదలైన రెండు వారాలు పూర్తయి, మూడో వారంలోకి అడుగుపెట్టినా వసూళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అధిగమించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో అయ్యప్ప స్వామిని పోలిన గెటప్‌లో పులిపై కూర్చున్న చిన్నారి కనిపించగా.. ఆమె పక్కన రవితేజ, ప్రియా భవానీ శంకర్ దర్శనమిచ్చారు. ఈ విజువల్ సినిమాలో కనిపించనిది కావడంతో అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు. పోస్టర్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక ‘ఇరుముడి’ మూడో వారంలోనూ బాక్సాఫీస్‌పై తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఈ వారాంతంలో పెద్దగా చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాబోయే వీకెండ్‌లోనూ థియేటర్ల వద్ద ‘ఇరుముడి’ హవా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోవడంతో చిత్ర బృందం, రవితేజ అభిమానులు సంబరాల్లో ఉన్నారు. మున్ముందు ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరుగుతాయా? అనేది చూడాలి.

also read: ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌కు రెడీ.. దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు