క్రైమ్ మిర్రర్ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు పథకాల అమలుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు మార్గం సుగమమైంది.
పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేస్తోంది. అయితే పథకాల అమలుకు సంబంధించిన జీవోలపై సింగిల్ బెంచ్ స్టే విధించడంతో కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
ప్రభుత్వం తరఫున వాదనలు విన్న సీజే ధర్మాసనం.. సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించడంతో పాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు కూడా ఉపశమనం కలిగినట్లైంది. ఈ తీర్పుతో పథకాల అమలుపై నెలకొన్న అడ్డంకులు తొలగినట్లయ్యాయి.
also read : పాటలో నటించాడని చంపేశారు.. హరియాణా సింగర్ అంకిత్ హత్య వెనుక షాకింగ్ రీజన్!
