-
మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరాలు
-
తప్పు పడుతున్న సాగునీటి నిపుణులు
-
ఏపీ ది తప్పే కాదంటూ వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు జాతికి అందించారు చంద్రబాబు. కరువు నేలపై కృష్ణమ్మ జలాలను పారించారు. ఇప్పుడు అది తెలంగాణలో కాక రేపుతోంది. వెలిగొండ ప్రాజెక్టులోకి నీటిని తరలించడానికి తప్పుపడుతూ మాజీమంత్రి, గులాబీ పార్టీ కీలక నేత హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతులు లేకుండా శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోందని.. ఇది తెలంగాణ హక్కులకు విఘాతం కలిగించే చర్యలంటూ విమర్శలు గుప్పించారు.
రెండు రాష్ట్రాలకు నిర్దిష్ట కేటాయింపులు…
Also Read:తుక్కుగూడ నర్సు శిరీష కేసులో కీలక మలుపు.. అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టంలో వెల్లడి
వాస్తవానికి శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు నుంచి రెండు రాష్ట్రాలకు నిర్దిష్ట కేటాయింపులు, చట్టబద్ధమైన వాటాలు కూడా ఉన్నాయి. ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహాలు పోటెత్తుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ భారీగా నీటిని వినియోగించుకుంటుంది. అదే సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల సహా ఇతర వ్యవస్థల ద్వారా అవసరమైన మేర జలాలను తోడుకుంటుంది. అటువంటప్పుడు ఏపీ ప్రభుత్వం తన వాటా పరిధిలో ఉన్న శ్రీశైలం జలాలను తీవ్ర ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చే వెలిగొండ ప్రాజెక్టుకు తరలించడంలో తప్పేంటి అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.
సెంటిమెంట్ అస్త్రంగా…
Also Read: బిల్లు చెల్లించలేకపోయిన మహిళకు షాకింగ్ శిక్ష.. గుండు కొట్టించిన బార్ యాజమాన్యం
ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభం వేళ సెంటిమెంట్ ను రగిలించడమే గులాబీ పార్టీ లక్ష్యం అన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ప్రాజెక్టు వివాదాలు లేకుండా.. నికర, మిగులు జలాలు ఆధారంగా తన ప్రాంత ప్రజలకు ఏపీ ప్రభుత్వం నీటిని అందిస్తుంటే.. దానిని అడ్డుకునేలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని నీటిపారుదల నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా నీటిని సద్వినియోగం చేసుకోవడం రెండు ప్రభుత్వాల బాధ్యత. చట్టబద్ధమైన కేటాయింపులు అయితే నిబంధనల ప్రకారం జరుగుతున్న నీటి తరలింపును కూడా.. తీవ్రమైన ఉల్లంఘన గా ప్రచారం చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేస్తున్నారు.
