బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో H1N1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇమ్రాన్‌కు వైద్యులు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ కారణంగా బెంగళూరులో జరగాల్సిన బాలీవుడ్ థీమ్ ఈవెంట్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్ హష్మీ హాజరుకావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తన ఆరోగ్య పరిస్థితి, ఈవెంట్ వాయిదా విషయాన్ని ఇమ్రాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వాయిదా పడిన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అవే టికెట్లు కొత్త తేదీన జరిగే కార్యక్రమానికి చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు.
ఇమ్రాన్ హష్మీ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.
also read: ‘ఎల్లమ్మ’లో ‘మ్యాడ్’ హీరోయిన్.. వేణు యెల్దండి సినిమాలో కీలక అప్‌డేట్!
