Homeక్రైమ్పుణే జిల్లాలో దారుణం...! 9ఏళ్ల బాలిక‌పై అత్యాచారం...

పుణే జిల్లాలో దారుణం…! 9ఏళ్ల బాలిక‌పై అత్యాచారం…

పుణే, క్రైమ్‌మిర్రర్‌: ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన మాన‌వ మృగాల్లో మార్పు మాత్రం క‌నిపించ‌డం లేదు. చిన్న పిల్ల‌ల నుంచి వృద్దుల వ‌ర‌కు దేశంలో ఏదో ఒక చోట కామాంధుల చేతిలో బ‌లి అవుతూనే ఉన్నారు. తాజా మ‌హారాష్ర్టలోని ఫుణే జిల్లాలో 9ఏళ్ల బాలిక‌పై పొరుగింటి వ్య‌క్తి అత్యాచారం చేసి హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌ల రేపింది. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా వేడెక్కింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, కేసును త్వరితగతిన విచారించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పుణె-నాసిక్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాగా పుణె జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. మంగళవారం అనారోగ్యంగా ఉండటంతో బాలిక పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని విషయాన్ని తెలుసుకున్న నిందితుడు బాలికను లైంగికంగా వేధించాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు.

Also Read: UP Crime: విద్యార్థిపై టీచర్‌ దాష్టీకం.. 39 సెకన్లలో 17 చెంపదెబ్బలు!

బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించారు. గంటల పాటు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి నిందితుడు కూడా వెతికాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఓ వాగు సమీపంలోని చెట్టు కింద బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించి కీలక ఆధారాలను సేకరించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని, కేసును త్వరితగతిన విచారించాలని బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Also Read: ‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ ట్రీట్.. డల్లాస్‌లో ‘యేష నాగుల’ లైవ్ పెర్ఫార్మెన్స్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు