విజయవాడ,క్రైమ్‌మిర్రర్: స్నాప్‌చాట్‌లో యువతితోపరిచయం పెంచుకున్న ఓ యువకుడు …ఆమెను నమ్మించి రూ. కోటిన్నర కొ ట్టేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి మోసపోయానని మాయమాటలు చెప్పి డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో విడతలవారిగా డబ్బులు ఇచ్చినప్పటికీ మరింత ఎక్కువగా ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో చివరకు సదరు యువతి పోలీసులను ఆశ్రయించారు.
Also Read:శ్రీశైలంలో ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
విజయవాడకు చెందిన యువతి.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గౌతం అనే యువకుడు స్నాప్‌చాట్‌లో యువతికి పరిచమయ్యాడు. తాను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించాడు. క్రిప్టో కరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు యువతికి గౌతం చెప్పాడు. నిజమేనని నమ్మిన యువతి మొదట రూ.10 లక్షలు ఇచ్చారు. మళ్లీ డబ్బులు కావాలని లేదంటే.. చనిపోతానని బెదిరించి విడతల వారిగా కోటిన్నర వసూలు చేశాడు. అయితే గౌతం వేధింపులు తాళలేక బాధిత యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: రామగుండంలో ఉగ్రలింకుల కలకలం…! ఎన్ ఐఏ సోదాలు…
