వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది. అంకిరెడ్డిగూడెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అంకిరెడ్డిగూడెంకు చెందిన రాపోలు దానయ్యను అతని భార్య శారద, రాపోలు శివ కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆదివారం పొలం వద్ద దానయ్యపై ఇద్దరూ బండరాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
దానయ్యను హత్య చేసేందుకు శారద, శివ ముందుగానే పథకం వేసుకున్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శారదకు గతంలోనూ ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
also read: పాము కాటుతో యువకుడి మృతి.. నాటు వైద్యం వికటించడంతో తీవ్ర విషాదం
