Homeఆంధ్ర ప్రదేశ్జోగి రమేష్ కుటుంబానికి కోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

జోగి రమేష్ కుటుంబానికి కోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన కుటుంబ సభ్యులకు కోర్టులో ఊరట లభించింది. గృహ హింస, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులో జోగి రమేష్‌, ఆయన కుమారుడు జోగి రాజీవ్‌తో పాటు కుటుంబ సభ్యులకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కేసులో న్యాయస్థానం పలు షరతులను విధించింది. ముఖ్యంగా బాధితురాలు మేఘనతో పాటు కేసులోని సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది.

కోర్టు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.

also read: బ్రహ్మాస్త్ర 2పై భారీ అప్‌డేట్.. శివ, దేవ్‌గా రణ్‌బీర్.. అమృతగా దీపిక?

తాజావార్తలు