అమరావతి, క్రైమ్‌మిర్రర్: బస్సులో పరిచయమైన కండక్టర్ ప్రేమ పేరుతో మోసం చేసి రూ.20లక్షలు, బంగారం తీసుకున్నాడని యువతి ఆరోపించింది. దీంతో తనకు ఎదురైన సమస్యను రాష్ర్ట రవాణ, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ కండక్టర్‌పై ఫిర్యాదు చేసింది. తాడెపల్లిలోని మంత్రి కార్యాలయంలో మంత్రిని కలిసి తనకు జరిగిన పరిణామాలను వివరించి న్యాయం చేయాలని కోరింది. బస్సులో పరిచయమైన కండక్టర్ ప్రేమ పేరుతో తనను మోసం చేశారని, తన నుంచి నగదు, బంగారం తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మంత్రి వెంటనే కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడ చదవండి:
-
89 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదు.. ప్రముఖ యూట్యూబర్‌పై చోరీ, బెదిరింపుల కేసు
-
హిందుస్థాన్ షిప్ యార్డ్ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది….! రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
-
వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అఘాయిత్యం.. వీడియోలతో బెదిరింపులు
-
పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం.. టీ స్టాల్ నిర్వాహకుడు మృతి
