ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రజల సమస్యలను మరింత బలంగా వినిపించేందుకు, ప్రజల పక్షాన నిలబడే రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నెలలోనే తన కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.
కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ విధివిధానాలు, రాజకీయ కార్యాచరణ తదితర అంశాలను ప్రకటన సమయంలో స్పష్టం చేయనున్నట్లు తెలిపారు.
కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆయన కొత్త పార్టీ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
also read: కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.. దేశభక్తిపై పాఠాలు చెప్పొద్దంటూ కౌంటర్
