Homeవైరల్72 ఏళ్ల వయసులో మనవడితో కలిసి ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన విజయవాడ వాసి

72 ఏళ్ల వయసులో మనవడితో కలిసి ఎల్‌బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన విజయవాడ వాసి

వయసు కేవలం సంఖ్య మాత్రమే.. సంకల్పం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు నిరూపించారు. 72 ఏళ్ల వయసులో తన 17 ఏళ్ల మనవడు అనురాగ్ పోకూరితో కలిసి యూరప్‌లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరమైన మౌంట్ ఎల్‌బ్రస్ వెస్ట్ పీక్‌ను అధిరోహించి అరుదైన ఘనత సాధించారు.

సముద్ర మట్టానికి సుమారు 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్‌బ్రస్ వెస్ట్ పీక్‌ను తాతా-మనవడు జోడీ ఈ నెల 14న విజయవంతంగా అధిరోహించింది. మంచుతో నిండిన క్లిష్టమైన మార్గంలో సాహసోపేతంగా ప్రయాణించి శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. ఈ విజయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ యాత్రలో రవీంద్రరావుకు ఆయన మనవడు అనురాగ్ తోడుగా నిలిచాడు. 17 ఏళ్ల అనురాగ్ పోకూరి ప్రముఖ సినీ నిర్మాత, ‘ఈతరం ఫిల్మ్స్’ అధినేత పోకూరి బాబూరావు మనవడు కావడం విశేషం.

72 ఏళ్ల వయసులోనూ శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, పట్టుదలను కొనసాగిస్తే వయసు సాహసాలకు అడ్డంకి కాదని రవీంద్రరావు తన విజయంతో చాటిచెప్పారు.

తాతా-మనవడు కలిసి సాధించిన ఈ సాహస యాత్రపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా కలలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రవీంద్రరావు ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తోంది.

also read: బిగ్ బాస్ టైటిల్ గెలిచినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు- పల్లవి ప్రశాంత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు