HomeUncategorizedమంత్రివర్గంలోకి జగ్గారెడ్డి...! సీఎం కీల‌క నిర్ణ‌యం...

మంత్రివర్గంలోకి జగ్గారెడ్డి…! సీఎం కీల‌క నిర్ణ‌యం…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో విభేదాల పర్వం బయటపడుతోంది. ఈ తరుణంలో రాజకీయంగా బలోపేతం కావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో సొంత బలగం, ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని ప్రోత్సహించాలని భావిస్తున్నారు. త్వరలో ఆయనను ఎమ్మెల్సీ ని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన నేత కావడంతో రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇటీవల సీఎం రేవంత్ కు అండగా నిలుస్తున్నారు జగ్గారెడ్డి. అటువంటి నేతను తన వర్గంలోకి తెచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి రేవంత్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

జగ్గారెడ్డి పై పొగడ్తలు…

Also Read:గురుకులంలో అర్ధరాత్రి ర్యాగింగ్ కలకలం.. పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి

ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిని పొగడ్తల వర్షంతో ముంచేత్తారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఇంత నిబద్ధత కలిగిన నాయకుడు దొరకడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కర్ణాటకలో ఓ నేతను మంత్రిగా చేసి.. తరువాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదే మాదిరిగా జగ్గారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తప్పులేదు అని వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని సంకేతాలు పంపారు. మంత్రి పదవి దక్కలేదని చాలామంది నేతలు ఆగ్రహంగా రగిలిపోతున్న వేళ.. జగ్గారెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మంత్రి పదవి ఇచ్చిన తప్పు లేదన్నట్టు మాట్లాడడం చూస్తుంటే రేవంత్ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది.

Also Read:వైయస్ షర్మిల కు హై కమాండ్ షాక్ …! జీవీ హ‌ర్ష‌కుమార్‌కు ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు….?

తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1986లో తొలిసారిగా సంగారెడ్డి మున్సిపాలిటీకి బిజెపి తరఫున కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1995లో అదే సంగారెడ్డి మున్సిపాలిటీకి చైర్మన్ అయ్యారు జగ్గారెడ్డి. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అదే సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంగారెడ్డి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎంపికయ్యారు. 2014లో మాత్రం ఓడిపోయారు. 2018లో మాత్రం గెలిచారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే మాత్రం రేవంత్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి మంత్రి అయ్యుండేవారు.

రేవంత్ కు అనుకూలం…

Also Read:స్వాతంత్య్ర వేడుకల వేళ కాల్పుల కలకలం.. తండ్రీకొడుకుల దారుణ హత్య

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ వస్తున్న ఆయన రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. పైగా రేవంత్ కు అండగా నిలిచిన నేతల్లో జగ్గారెడ్డి ఒకరు. అయితే మంత్రివర్గంలో సీనియర్ నేతలుగా ఉన్న చాలామంది నాయకులు రేవంత్ పై పరోక్షంగా ఫైట్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి పదవులు దక్కని సీనియర్లు రేవంత్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారట రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తూర్పు జయప్రకాశ్ రెడ్డికి త్వరలో ప్రమోషన్ దక్కడం ఖాయమని తెలుస్తోంది. మరి అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు