అనకాపల్లి జిల్లా చోడవరంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిన్నబజారు వీధికి చెందిన వెంకటరావు (58) హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
వివరాల ప్రకారం.. వెంకటరావుకు, ఆయన భార్య ఇందిర (54)కు కొంతకాలంగా కుటుంబ విషయాలపై విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో ఇందిర కత్తితో వెంకటరావుపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో ఇందిర ఆగ్రహానికి గురైనట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
also read: దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
