ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: చైనాకు భారత్ సుంకాల నుంచి తప్పించుకోవడానికి సాయం చేస్తోందని అమెరికా ఆరోపించింది. దీనికి షాడో నెట్‌వర్క్ సాయం చేస్తోందంటూ పేర్కొంది. ఈ నెట్ వర్కులో భారత్‌తోపాటు 40 దేశాలు ఉన్నాయని పేర్కొంది. ఇటీవల ‘ది గ్రేట్ ట్రాన్సిషిప్మెంట్ స్కామ్’ పేరిట విడుదలైన నివేదికలో అగ్రరాజ్యం ఈ ఆరోపణలు చేసింది. దానిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవారో విడుదల చేశారు.
Also Read: దానిమ్మ జ్యూస్‌తో బీపీ కంట్రోల్ అవుతుందా?
అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నాయని భావించిన దేశాలపై అమెరికా సెక్షన్ 301 పేరిట టారిఫ్లను విధిస్తుంటుంది. 2018లో చైనాపై ఆ సెక్షన్ కింద ఆంక్షలు పెట్టింది. అప్పటి నుంచి చైనాకు అక్రమ సరకు రవాణా పెరిగిందని ఆ నివేదిక వెల్లడించింది. దాని విలువ 303 బిలియన్ డాలర్లు వరకు ఉంటుందని అంచనా వేసింది. రీలేబులింగ్, రీప్యాకేజింగ్, రవాణా మార్గాన్ని మార్చడం కోసం చైనా వస్తువులను ఇతర దేశాల మీదుగా పంపుతుంటారు. కార్మికులకు చెల్లించే వ్యయాలు తక్కువగా ఉన్న దేశాలు, కస్టమ్స్ పర్యవేక్షణ పెద్దగా లేని, అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండే దేశాల ద్వారా చైనా తయారీదారులు వస్తువులను తరలిస్తుంటారు.
Also Read:పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే.. ఆటలే మంత్రం!
అలా వచ్చిన వస్తువులు చైనా(China) వే అయినప్పటికీ.. చూడటానికి మాత్రం వేరే దేశానివిగా అనిపిస్తాయి. దానిని ఉద్దేశించే ఈ రిపోర్ట్ పేర్కొంది.వస్తువు తయారైన దేశం నుంచి గాకుండా వేరే దేశం మీదుగా అమెరికాకు చేరే వస్తువులను గుర్తించేందుకు ‘డిటెక్టివ్ బోర్డర్’ పేరిట ఒక ఏఐ టూలు తీసుకువచ్చేందుకు అగ్రరాజ్యం ప్రయత్నాలు చేస్తోంది. షిప్మెంట్ రికార్డులు, రూటింగ్ హిస్టరీ, ఓనర్షిప్ లింక్స్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఆ టూల్ వాటిని గుర్తించనుంది.
