Homeజాతీయంసంచ‌ల‌న నిర్ణ‌యం...! పెళ్లికాని యువ‌త మ‌ద్యం తాగితే రూ.5వేలు జ‌రిమాన...

సంచ‌ల‌న నిర్ణ‌యం…! పెళ్లికాని యువ‌త మ‌ద్యం తాగితే రూ.5వేలు జ‌రిమాన…

చెన్నై, క్రైమ్‌మిర్ర‌ర్‌: త‌మిళ‌నాడులోని ఓ గ్రామం సంచ‌ల‌నం నిర్ణ‌యం తీసుకుంది. మ‌ద్యం మ‌హమ్మారి నుంచి యువ‌త‌ను కాపాడేందుకు త‌మిళ‌నాడులోని నాగ‌ప‌ట్టినం జిల్లా వేళాంగ‌ణ్ణి స‌మీపంలోని విళుంద‌మావ‌డి గ్రామం నిర్ణ‌యం తీసుకుంది. ‘మద్యాన్ని అరికడదాం. ‘ప్రజలను రక్షిద్దాం’ అనే నినాదంతో కార్యక్రమం చేపట్టింది. దీనికి సంబంధించి గ్రామంలో బ్యానరును సైతం ఏర్పాటు చేసింది.

Also Read:ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌.. 2- 3 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన

పెళ్లికాని యువకులు మద్యం తాగినట్టు తేలితే రూ.5వేల జరిమానా వసూలుచేస్తామని తెలిపింది. పెళ్లైన వారు తాగవచ్చని, అయితే గొడవలకు దిగకూడదని.. అలాచేస్తే వారినుంచి కూడా రూ.5వేల జరిమానా వసూలుచేస్తామని హెచ్చరించింది. ఈ ప్రయత్నానికి గ్రామస్థులు సహకారం అందించాలని కోరింది.

Also Read:రెడ్ కార్పెట్‌పై ఊహించని ముద్దు.. నికిత రావల్ షాకింగ్ రియాక్షన్

తాజావార్తలు