Homeక్రైమ్ఝాన్సీ హైవేపై ఘోర ప్రమాదం.. అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ మృతి

ఝాన్సీ హైవేపై ఘోర ప్రమాదం.. అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల మరణించిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. స్నేహితులతో కలిసి SUVలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఝాన్సీ హైవేపై వేగంగా వెళ్తున్న SUV అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ కిందపడింది. ప్రమాదంలో SUV తీవ్రంగా దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటనలో అబాన్‌తో పాటు అతనితో ప్రయాణిస్తున్న మరో స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెనుక నుంచి వస్తున్న మరో వాహనం డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక వాహనం అదుపు తప్పడానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

also read: రుణాల పేరుతో సైబర్ మోసాలు.. ఢిల్లీలో 21 మంది తెలుగు యువతుల అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు