హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలనే ఆ పార్టీలు అవలంబిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ మైనారిటీ సంతూష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకం. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదు. టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో వెయ్యి మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడు. అట్లాంటి దుర్మార్గుడిని హీరో చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. వాస్తవాలు చెబితే కాంగ్రెస్ కు కడుపు మంటగా ఉంది.
Also Read:జగిత్యాల బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం.. మనుమడు మృతి, తాత పరిస్థితి విషమం
బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే… నిధులేవి? హైదరాబాద్ లో 3, 400 ఆలయాలుంటే బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు విదిలిస్తారా? రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు విడుదల చేస్తారా? బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. వాస్తవాలు ప్రస్తావిస్తే మతం పేరుతో చిచ్చు పెట్టాలని మాట్లాడతారా? రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తే…80 శాతం మంది హిందువుల పండుగకు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి. విదేశాలు నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా కాంగ్రెస్ రూ.2.40 కోట్లు విడుదల చేస్తారా? నేను హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా ..గోమాతను వధిస్తే ప్రశ్నించాలా? వద్దా? హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించాలా? వద్దా? 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా? నేను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తా హిందువులంతా జాగ్రుతం కావాలని అన్నారు.
Also Read:ఫాంహౌస్‌లో దోపిడీకి దుండగుల యత్నం.. వాచ్‌మెన్ దారణ హత్య
