Homeక్రైమ్టెర్రస్‌పైకి వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థినిపై అఘాయిత్యం..సెక్యూరిటీ గార్డు అరెస్ట్

టెర్రస్‌పైకి వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థినిపై అఘాయిత్యం..సెక్యూరిటీ గార్డు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ పీజీ వసతి గృహంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో టెర్రస్‌పైకి వెళ్లిన ఇంటీరియర్‌ డిజైనింగ్‌ విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆనంద్‌నగర్‌ ప్రాంతంలోని ఓ పేయింగ్‌ గెస్ట్‌ వసతి గృహంలో యువతి ఉంటూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చదువుతోంది. ఆగస్టు 8న రాత్రి భోజనం అనంతరం సుమారు 10 గంటల సమయంలో వాకింగ్‌ చేసేందుకు భవనం పైకి వెళ్లింది. అక్కడ సెక్యూరిటీ గార్డు కనిపించడంతో ఆమె తిరిగి కిందకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే నిందితుడు ఆమెను అడ్డుకుని వైర్‌తో మెడకు బిగించి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారైయ్యాడు. గాయాలతో ఉన్న యువతిని గుర్తించిన అనంతరం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు

ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పీజీ భవనంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ధరమ్‌ సింగ్‌పై అనుమానం వ్యక్తమైంది. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ధరమ్‌ సింగ్‌ పీజీ వసతి గృహంలో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
also read : పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు