క్రైమ్ మిర్రర్ : తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్‌కు సంబంధించిన కుటుంబ వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయానికి ముందు విజయ్ దంపతుల మధ్య విడాకుల అంశం తెరపైకి రావడం అప్పట్లో రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళ వెట్రి కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేయడం, ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించడం, అనంతరం మద్దతు పార్టీల సహకారంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా రాజకీయ చర్చల్లోకి వచ్చాయి. విజయ్‌పై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేసినప్పటికీ, ఓటర్లు వాటిని పెద్దగా పట్టించుకోకుండా తమ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిమానులు, పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకోవడంతో ఈ వ్యవహారానికి తెరపడినట్లుగా కనిపిస్తోంది. అయితే విజయ్ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం మాత్రం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.
also read ; రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత అవమానాలనైనా ఎదుర్కొంటా: సీఎం విజయ్
