Homeక్రైమ్తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మిస్టరీ.. ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మిస్టరీ.. ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం

చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనరల్ బోగీలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ ట్రాలీ బ్యాగ్ ప్రయాణికుల్లో భయాందోళనకు కారణమైంది.

రైలు ఆగ్రా పరిధిలోకి చేరుకున్న సమయంలో బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో పాటు రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఆగ్రా జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బ్యాగ్‌ను తెరిచి పరిశీలించారు. అందులో గుర్తుతెలియని వ్యక్తికి చెందిన మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి తల, కొన్ని శరీర భాగాలు లేనట్లు పోలీసులు గుర్తించారు.

బ్యాగ్‌లో లభించిన కొన్ని ఆధారాల ఆధారంగా ఈ ఘటనకు చెన్నైతో సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు, ఘటన వెనుక కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం రైలులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు.. బ్యాగ్‌ను ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడు బోగీలో ఉంచారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

also read: హైదరాబాద్‌లో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్, విద్యార్థి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు