HomeUncategorizedఅక్కను వేధిస్తున్నాడనే కక్షతో బావ హత్య.. ఐదుగురు బావమరుదులు అరెస్ట్

అక్కను వేధిస్తున్నాడనే కక్షతో బావ హత్య.. ఐదుగురు బావమరుదులు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : అక్కను వేధిస్తున్నాడనే కక్షతో ఓ వ్యక్తిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి జార్ఖండ్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు రప్పించి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మంత్రాజ్ తథేరా తన భార్య సుమిత్రా సితారపై తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కను వేధిస్తున్న బావపై కక్ష పెంచుకున్న ఆమె ఐదుగురు సోదరులు అతడిని హత్య చేయాలని పథకం రచించారు.

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానుపల్లి సమీపంలోని ఓ పేపర్ మిల్లులో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మంత్రాజ్‌ను జార్ఖండ్ నుంచి కదిరి ప్రాంతానికి రప్పించారు. అనంతరం పడమటివారిపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి, బండరాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం పడమటివారిపల్లి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ సాక్ష్యాలను పరిశీలించిన దర్యాప్తు బృందం హత్యకు ముందు జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు స్థానిక పేపర్ మిల్లులో పనిచేసినట్లు గుర్తించింది. ఘటన అనంతరం వారు కనిపించకుండా పోవడంతో అనుమానం బలపడింది.

డీఎస్పీ శివనారాయణస్వామి పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.500 నగదు, హత్య సమయంలో ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అక్కపై జరుగుతున్న వేధింపులకు ప్రతీకారంగా ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్‌కు తరలించారు.
also read : గ్యాస్ సిలిండర్ కథ అడ్డం తిరిగింది.. భర్త హత్య కేసులో భార్య అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు