క్రైమ్ మిర్రర్ : దుబాయ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ కార్ల షోరూమ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడిని కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన 27 ఏళ్ల షిజిన్ పాల్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో షోరూమ్ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కొందరు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో షిజిన్ పాల్ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. షిజిన్ పాల్ గత నవంబర్‌లోనే ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి కార్ల షోరూమ్‌లో మల్టీమీడియా మార్కెటింగ్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యువతిని 2025లో వివాహం చేసుకున్న షిజిన్.. త్వరలోనే తన భార్యను కూడా దుబాయ్‌కు తీసుకెళ్లాలని భావించినట్లు స్నేహితులు తెలిపారు. అయితే ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
also read : హర్మూజ్ జలసంధి తెరుస్తారా.. లేదా? ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠ
