దేశంలో ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన కొన్ని బ్యాచ్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేని ఫ్లేవర్స్ వాడుతున్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో, ఆ ఉత్పత్తుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
పరీక్షల్లో ముఖ్యంగా విస్కీ, రమ్ వర్గాల్లో కృత్రిమ సువాసనలను ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులు పరిశీలనలోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్‌లో తయారైన Antiquity Blue, Royal Challenge Whisky, Bagpiper Deluxe Whisky, అలాగే Old Cask Deluxe XXX Rum పై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో తయారయ్యే Old Monk కు చెందిన కొన్ని వేరియంట్లు కూడా ఈ జాబితాలో చేరాయి.
అధికారుల ప్రకారం, మద్యం తయారీలో ఉపయోగించే పదార్థాలు నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉండాలి. కానీ కొన్ని బ్యాచ్‌లలో ఆ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
సంబంధిత కంపెనీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, వివరణ కోరినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, నాణ్యతపై అనుమానం ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలని సూచించారు.
also read: అక్రమ సంబంధం కోసం భర్త, అత్తను విషం పెట్టి చంపాలని చూసిన మహిళ
