Homeక్రైమ్కూతురిపై కన్నేశాడని... ప్రైవేట్ పార్ట్ కోసేసింది... 

కూతురిపై కన్నేశాడని… ప్రైవేట్ పార్ట్ కోసేసింది… 

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తన కూతురితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ మహిళ అతడిపై చేసిన దాడి ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం.. సురేశ్ అనే ఆటో డ్రైవర్ ఓ వివాహితతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఆమె కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని మహిళ అనుమానించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అతడిని ఇంటికి పిలిపించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అనంతరం గొడవ తీవ్రమవడంతో సురేశ్‌ను చీరతో బంధించి అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాకుండా, ఇలాంటి విషయాల్లో పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.

also read: తెలంగాణ సంస్కృతిని తప్పుగా చూపొద్దు.. ఇడుపు కాయితం వివాదంపై నరేష్ కీలక వ్యాఖ్యలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు