సంస్థాన్ నారాయణపురం,క్రైమ్ మిర్రర్ :- సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను నియంత్రించవచ్చునని ఎస్ఐ పాండు అన్నారు. ఆదివారం నారాయణపురం మండల కేంద్రంలో వర్తక సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై పాండు పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటు పై వారికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపు యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలతోనే నేరాలను నియంత్రించవచ్చు అని తెలిపారు.చోరీ జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించడం సులభతరమవుతుందన్నారు. సీసీ కెమెరాలను షాపులోనే కాకుండా షాపు వెనుక భాగముతో పాటు రోడ్డు పూర్తిగా కనిపించే విధంగాసీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. ఇప్పటివరకు 25 మంది షాపు యజమానులకు నోటీసులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంగం అధ్యక్షుడు వంగరి రఘు, కోశాధికారి సురక్షితం, తెలంగాణ బిక్షం, ఉప్పల వెంకటేష్, చిలువేరు శంకర్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
ఏపీలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక!
కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా.. పరగడుపున ఈ నీళ్లు తాగండి!
