Homeతెలంగాణమూవీస్ లోకి తేజస్విని ఎంట్రీ...?

మూవీస్ లోకి తేజస్విని ఎంట్రీ…?

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చిన్న కూతురు తేజస్విని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన డ్యాన్స్‌తో ఫుల్ ఫేమ్ పాదించుకున్నారు. గతంలో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సూపర్ క్రేజ్ వచ్చింది. రీసెంట్‌గా నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీలో ‘సారంగ దరియా’ పాటకు అద్భుతమైన స్టెప్పులేశారు. ఫుల్ ఎనర్జీతో ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. ఇప్పుడు తేజస్విని మూవీల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ డ్రామా స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో బాలయ్య కుమార్తె ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:పేకాట ఆడితే కఠిన చర్యలే : ఎస్‌ఐ సాంబమూర్తి

ప్రస్తుతం కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును ఎవరి నిర్మించేది? పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా… ఓ సందేశాత్మక చిత్రంగా దీన్ని రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట.అయితే, ఈ ప్రచారంపై అటు బాలయ్య కానీ, ఇటు తేజస్విని కానీ ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇటీవలే తేజస్విని ఓ గోల్డ్ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పుడే మూవీల్లోకి ఎంట్రీపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ తర్వాత తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేశారు. దీంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. నందమూరి ఇంటి నుంచి మరో వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. వలస కూలీలపై కాల్పులు, ఒకరి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు