హర్యానాలోని రోహ్తక్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడి భార్య ముస్కాన్ (23) శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సమాచారం ప్రకారం, ముస్కాన్‌కు 2023లో వివాహం జరిగింది. గత ఏడాది ఆమెకు ఓ బిడ్డ జన్మించాడు. కుటుంబ జీవితం సాధారణంగా కొనసాగుతున్నట్లు కనిపించినా, అనూహ్యంగా ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఆత్మహత్యకు ఒక రోజు ముందు ముస్కాన్ సోషల్ మీడియాలో ఓ పంజాబీ పాటతో రీల్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. ఆ వీడియోకు ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, ముస్కాన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారణం వేధింపులేనని ఆరోపిస్తూ క్రీడాకారుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముస్కాన్ మరణానికి గల అసలు కారణాలు ఏమిటి అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
also read: మహిళపై లైంగిక దాడి కేసులో ఎస్సై అరెస్టు…!
