Homeక్రైమ్చంపి డ్రమ్ లో వేస్తానని బెదిరించిన భార్య... మానసిక ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య

చంపి డ్రమ్ లో వేస్తానని బెదిరించిన భార్య… మానసిక ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దాంపత్య జీవితంలో ఎదురైన సమస్యల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇటావా జిల్లాకు చెందిన 27 ఏళ్ల వినయ్ యాదవ్ ఇంటి వరండాలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. జులై 31న ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. వినయ్ భార్య రంజనాతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడేదని, చంపి బ్లూ డ్రమ్ లో వేస్తానని అనేదనీ… అందుకే తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని వారు పేర్కొన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరించేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ వేధింపులను తట్టుకోలేక వినయ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అసలు కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: UPI యూజర్లకు అలర్ట్.. ఫ్రీ ట్రయల్స్ తర్వాత ఈ తప్పు చేస్తే ఖాతా నుంచి డబ్బులు కట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు