యూపీఐ యాప్స్ వినియోగించే వారికి బ్యాంకులు, సైబర్ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా యాప్స్ ఫ్రీ ట్రయల్ పేరుతో సబ్‌స్క్రిప్షన్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఫ్రీ ట్రయల్ గడువు ముగిసిన తర్వాత ఆటో పేమెంట్ సదుపాయం (Auto Mandate) కొనసాగుతున్న విషయం చాలామంది మర్చిపోతున్నారు.
ఆటో మ్యాండేట్ యాక్టివ్‌గా ఉంటే, ఆ యాప్‌ను ఉపయోగించకపోయినా నిర్ణీత సమయంలో ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రయల్ సమయంలో అనుమతి ఇచ్చిన ఆటో డెబిట్ సెట్టింగ్స్‌ను రద్దు చేయకపోతే తర్వాత చెల్లింపులు కొనసాగుతాయి.
ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఆటో పేమెంట్ విఫలమవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు దీనిపై అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులకు సంబంధించిన కొన్ని ఆటో పేమెంట్లు విఫలమైతే క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఎలా జాగ్రత్త పడాలి?
అవసరం లేని ఫ్రీ ట్రయల్ సబ్‌స్క్రిప్షన్లను వెంటనే రద్దు చేసుకోవాలి. UPI యాప్ లేదా బ్యాంకింగ్ యాప్‌లోకి వెళ్లి యాక్టివ్ ఆటో మ్యాండేట్లను చెక్ చేయాలి. ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లకు సంబంధించిన ఆటో పేమెంట్ అనుమతులను తొలగించాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్న నిర్లక్ష్యం కూడా ఆర్థిక నష్టానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి UPI వినియోగదారులు తమ ఆటో మ్యాండేట్ సెట్టింగ్స్‌పై అప్రమత్తంగా ఉండటం మంచిది.
also read: యాదాద్రి భువనగిరిలో దారుణం.. బాలికపై యువకుడి లైంగిక దాడి, కేసు నమోదు
