కర్ణాటకలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. విజయపుర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
లభించిన వివరాల ప్రకారం, నాగేంద్ర అనే వ్యక్తికి లక్ష్మీదుర్గ అనే కూతురు ఉంది. ఆమె ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్వతంత్రంగా జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమెకు వివాహ సంబంధం రావడంతో కుటుంబంలో చర్చలు మొదలయ్యాయి.
ఈ సమయంలో, కూతురు చదువుకు ఖర్చు చేశానని, పెళ్లి జరగాలంటే వరుడు కుటుంబం నుంచి భారీ మొత్తాన్ని ఇవ్వాలని నాగేంద్ర డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, పెళ్లి తరువాత కూడా కూతురు సంపాదన తనకే ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం.
ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోపోద్రిక్తుడైన నాగేంద్ర, లక్ష్మీదుర్గ పనిచేస్తున్న కాలేజీకి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
also read: “మాకూ న్యాయం కావాలి… చట్టం అందరికీ సమానంగా వర్తించాలి”- గాయపడిన ఢిల్లీ పోలీస్ కుటుంబాలు
