Homeక్రైమ్కాంచీపురంలో దారుణం.. అనుమానంతో గర్భిణి గొంతునులిమి హత్య చేసిన భర్త

కాంచీపురంలో దారుణం.. అనుమానంతో గర్భిణి గొంతునులిమి హత్య చేసిన భర్త

తమిళనాడులో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. కాంచీపురం జిల్లా పరిధిలోని పళయశివారం ప్రాంతంలో ఐదు నెలల గర్భిణిని ఆమె భర్తనే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనియా (28) అనే మహిళకు ఇటీవలే వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. అయితే, ఆమె భర్త సోమసుందరం (హోంగార్డు) భార్య గర్భంపై అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. కడుపులో ఉన్న శిశువు తనది కాదని అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలో కోపావేశానికి లోనైన సోమసుందరం.. భార్య సోనియాను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం సమాచారం అందుకున్న సాలవాక్కం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివాహం జరిగిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఆర్‌డీవో స్థాయి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ దారుణం స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగించింది. మహిళల భద్రత, కుటుంబ సంబంధాల్లో నమ్మకం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

also read: భోజనం ఆలస్యమైందని వదినను నరికి చంపిన మరిది.. బిహార్‌లో అమానుషం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు