-
Ramayana Trailer: మూడు గంటల్లోనే రికార్డు వ్యూస్..
-
పాన్ ఇండియాను షేక్ చేస్తున్న రామాయణ ట్రైలర్..!
Crime Mirror, Bollywood Updates: బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం రామాయణ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల లుక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించగా, యశ్ రావణుడి పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ట్రైలర్లో యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రణ్‌బీర్ ప్రశాంతమైన రాముడి పాత్రకు సరిపోయేలా కనిపించగా, సాయి పల్లవి సీత పాత్రలో హుందాతనాన్ని ప్రతిబింబించారు.
టీజర్ విడుదల సమయంలో విజువల్స్‌పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం, ట్రైలర్లో మాత్రం అత్యున్నత స్థాయి విజువల్ అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, పురాణ గాథను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
అయితే ట్రైలర్లో ఒక అంశం మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కథలో కీలకమైన దశ వరకు చూపించినప్పటికీ హనుమంతుడి పాత్రను ఒక్క షాట్లో కూడా చూపించలేదు. ఈ పాత్రను సన్నీ డియోల్ పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తొలి భాగంలో హనుమంతుడి పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.
ఇక వ్యూస్ విషయానికి వస్తే, విడుదలైన మూడు గంటల్లోనే హిందీ ట్రైలర్‌కు 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు 2.72 లక్షలకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్లకు కూడా మంచి స్పందన లభిస్తోంది.
పురాణ గాథను అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్‌కు లభిస్తున్న స్పందనతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
