తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొన్ని ప్రీమియం మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఖరీదైన స్కాచ్, వోడ్కా బ్రాండ్లపై ఈ ధరల పెంపు ప్రభావం పడనుంది.
సప్లయర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ.. కొన్ని బ్రాండ్ల ధరలను సవరించింది. ఇందులో భాగంగా 750 మిల్లీలీటర్ల స్కాచ్ బాటిల్‌పై సుమారు రూ.40 నుంచి రూ.50 వరకు పెంపు నమోదైంది. అలాగే కొన్ని వోడ్కా బ్రాండ్ల ధరలు రూ.30 వరకు పెరిగాయి.
ఇక ఇతర మద్యం బ్రాండ్ల ధరల మార్పుపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత మరిన్ని బ్రాండ్ల ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ధరల పెంపు నిర్ణయంతో ప్రీమియం మద్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: పారిస్‌లో కత్తులతో దాడి .. ‘ అల్లా చెప్పాడని’ నిందితుడి వ్యాఖ్యలు, ఉగ్ర కోణంలో విచారణ
