క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు.
తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని, ప్రస్తుతం తన స్వగ్రామమైన ఊళ్లపాలెంలోనే ఉన్నానని ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. కుటుంబంలో నాన్నమ్మ అనారోగ్యంతో ఉండటంతో గ్రామానికి వచ్చినట్లు చెప్పారు. తన కోసం పోలీసులు వెతికిన చిరునామాలు తాత్కాలిక నివాసాలేనని, అందువల్ల అపోహలు ఏర్పడ్డాయని వివరించారు.
దేశ చట్టవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, దర్యాప్తు అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. విచారణలో పాల్గొని తన నిర్దోషిత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించుకుంటానని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున కేసుకు సంబంధించిన వివరాలపై మరింత వ్యాఖ్యానించడం సముచితం కాదని ఉదయ్ కృష్ణారెడ్డి అన్నారు.
also read : జపాన్‌ను వణికించిన 7.1 తీవ్రత భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
