Homeక్రైమ్నానో కాలేజీది న‌యా మోసం...! విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం...

నానో కాలేజీది న‌యా మోసం…! విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం…

  • నానో కాలేజీకి అడ్ర‌స్ ఉండ‌దు… గుర్తింపు ఉండ‌దు…

  • గుర్తింపు లేకున్న ల‌క్ష‌ల్లో ఫీజుల దోపిడి

  • రేపు విద్యార్థుల‌తో ఎక్క‌డ ప‌రీక్ష‌లు రాయిస్తారు…

  • ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు…?

  • ఈ బోగ‌స్ నానో కాలేజీ పై అధికారులు చ‌ర్య‌లు తీసుకొని విద్యార్థుల‌కు న్యాయం చేయాలి

  • నానో కాలేజీ మూసే వ‌ర‌కు పోరాటాలు కొన‌సాగిస్తాం…విద్యార్థి సంఘాల డిమాండ్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్రర్ నిఘా ప్రతినిధి : ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న విద్యార్థుల‌ను ఎలాంటి గుర్తింపు లేని డంగ్పేట్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని నాదర్గుల్ కేంద్రంగా ది నానో జూనియర్ కాలేజ్ లో చేర్చుకొని విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌ని విద్యార్థి సంఘాలు మండిప‌డుతున్నాయి. అనుమతులు లేని బోగ‌స్ నానో కాలేజీని వెంట‌నే అధికారులు స్పందించి త‌నిఖీలు చేసి మూసి వేయించి విద్యార్థుల భ‌విష్య‌త్‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. నానో కాలేజీపై ఇంట‌ర్‌బోర్డు విద్యాశాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. నానో కాలేజీ యాజ‌మాన్యం పై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

నానో కాలేజీది న‌యా మోసం...! విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం...
నానో కాలేజీది న‌యా మోసం…! విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం…

Also Read:జనసేన రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సూసైడ్

గుర్తింపు కాలేజీని నిర్వ‌హిస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌లు ఫీజుల రూపంలో వ‌సూలు చేస్తూ విద్యార్థుల‌ను న‌ట్టేట ముందుచుతున్నార‌ని మండిప‌డుతున్నారు. గుర్తింపు లేని నానో కాలేజీ విద్యార్థుల చేత ఎలా ప‌రీక్షలు రాయిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేగాకుండా నానో కాలేజీ యాజ‌మాన్యం ఏదో ఒక ప్రైవేటు కాలేజీ పేరుతో ప‌రీక్ష‌లు రాయించాల‌న్న‌దే వారి ఉద్దేశంగా ఉంద‌ని తెలిపారు. అంతేగాకుండా విద్యాసంవ‌త్స‌రం పూర్తిగా క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్న విద్యార్థుల‌ను ఏదో ఒక ఇంట‌ర్‌మీడియ‌ట్ కాలేజీ నుంచి ప‌రీక్ష‌లు దుస్థితి దాపురించింద‌ని, దీనంత‌టికి కార‌ణం ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారుల కాసుల క‌క్కుర్తేన‌ని వారు విరుచ‌క‌ప‌డ్డారు.

అధికారులు నోటీసులు ఇచ్చారు…చేతులు దులుపుకున్నారు…

Also Read:యూపీలో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై ఉపాధ్యాయురాలి వేధింపులు

ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నాదర్గుల్ లో నిర్వహిస్తున్న నానో కాలేజీ యాజమాన్యానికి ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు .
గుర్తింపు లేని ఇంటర్మీడియట్ కాలేజీ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యా చట్టం చెబుతున్నప్పటికీ, అమలు చేయడానికి రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి, బోర్డు యంత్రాంగం వెనుకంజ వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలంగాణ విద్యా చట్టం 1982 ప్రకారం గుర్తింపు లేకుండా ఇంటర్మీడియట్ కాలేజీలను నిర్వహించే యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించవచ్చు. అలాగే కాలేజీలను మూసి వేసే అధికారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికి ఉన్నప్పటికీ, అలసత్వం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇట్టే ఎవరికైనా అర్థమవుతోంది. కాలేజీ యాజమాన్యంతో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు లాలూచీపడి వందలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ప‌ట్టించుకోని ఏ ఒక్క శాఖ …

Also Read:దేశంలోని టాప్ 10 రిచెస్ట్ సీఎంల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

ది నానో కాలేజీ నిర్వహిస్తున్న బిల్డింగ్ కు ఎటువంటి మునిసిపల్ అనుమతులు లేకపోయినప్పటికీ, ఇప్పటివరకు బడంగ్పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య కనీసం నోటీసులను కూడా జారీ చేయకపోవడం హాస్యాస్పదంగా ఉంది. మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ భవనాన్ని కూల్చివేసే అధికారం జిహెచ్ఎంసి అధికారులకు ఉన్నప్పటికీ, తమ అధికారాన్ని ఎందుకు ఉపయోగించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి నిరభ్యంతర పత్రం( ఎన్ ఓ సి )ని పొందకుండానే నిర్వహించే విద్య, వ్యాపార సంస్థల యాజమాన్యాలపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసే అధికారం ఉంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుడు ప్రకటనలతో బురిడీ కొట్టించి, ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు లేకుండానే కాలేజీ నిర్వహిస్తున్న యాజమాన్యంపై పోలీసులు సైతం కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read:అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజు సినిమాలో బిగ్ ట్విస్ట్!

ది నానో కాలేజీ యాజమాన్యం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి కాలేజీ నిర్వహిస్తున్నప్పటికీ, ఏ ఒక్క శాఖ కూడా స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 400 మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన ది నానో కాలేజీ యాజమాన్యంపై తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి స్పందించి సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ భవనాన్ని నిర్మించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ను కోరుతున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్న ది నానో కాలేజీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు