Homeక్రైమ్లక్ష్మీతండాలో దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు

లక్ష్మీతండాలో దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు

క్రైం మిర్రర్ : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలోని బుద్ధారం లక్ష్మీతాండ గ్రామ పంచాయతీలో దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీతాండకు చెందిన మెగ్య నాయక్ (55) తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం పక్కింటి వారు ఏదో పని నిమిత్తం మెగ్య నాయక్ ఇంటికి వెళ్లి పలుమార్లు పిలిచినా స్పందన రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. వెంటనే బయటకు వచ్చి గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన తీరును పరిశీలిస్తూ పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడు మెగ్య నాయక్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఆయన భార్య కొన్నేళ్ల క్రితమే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ, ఆస్తి లేదా ఇతర వ్యక్తిగత విభేదాల కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో లక్ష్మీతాండలో విషాద ఛాయలు అలుముకోగా, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
also read : తక్కువ ధరకే బంగారం అంటూ మోసం – కడపలో నకిలీ గోల్డ్ ముఠా బట్టబయలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు