ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్ (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదే వాహనంలో ఉన్న ఆయన భార్య భవాని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగళగిరి నుంచి తమ స్వగ్రామం చింతలపాడు వైపు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
also read: భార్య రాకపోవడంతో ఘోర నిర్ణయం.. మెదక్లో విషాదం
