Homeజాతీయంమిడ్‌డే మీల్‌లో తేలు కలకలం.. 100కి పైగా విద్యార్థులు అస్వస్థత, బీహార్‌లో ఆందోళన

మిడ్‌డే మీల్‌లో తేలు కలకలం.. 100కి పైగా విద్యార్థులు అస్వస్థత, బీహార్‌లో ఆందోళన

బీహార్ రాష్ట్రంలోని సుపాల్ జిల్లా త్రివేణిగంజ్ పరిధిలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గురువారం మధ్యాహ్న భోజనం అనంతరం 100కి పైగా విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

పాఠశాలలో వడ్డించిన ఆలూ-శనగల కూరలో చనిపోయిన తేలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించినట్టు సమాచారం. అయితే అప్పటికే చాలామంది విద్యార్థులు ఆ భోజనం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే వారికి గొంతు మంట, కడుపునొప్పి, వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి.

ఈ పరిణామంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే విద్యార్థులను సమీప ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు తక్షణ చికిత్స అందించడంతో ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించారు. భోజనంలో నాణ్యత లోపం, నిర్లక్ష్యం వంటి అంశాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తప్పిదం నిర్ధారణైతే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

also read: హనీమూన్ హత్య కేసు: సోనమ్‌కు బెయిల్ రద్దు, 3 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు