క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. నిన్న కొత్తగా విశాఖపట్నంలో 3, రాజమండ్రిలో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32కి చేరుకుంది.కడప జిల్లాలో సేకరించిన శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆ వైరస్ ఒమిక్రాన్ RF.5 వేరియంట్ అని నిర్ధారణ అయింది.అంతకుముందు కడప జిల్లాతో పాటు గుంటూరు, కాకినాడ, మన్యం, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జన నాయగన్ కోసం విజయ్‌కు ఊహించని రెమ్యునరేషన్..ఇండియన్ సినీ చరిత్రలోనే రికార్డా!
ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్?