Homeఆంధ్ర ప్రదేశ్భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి మోదీకి ఆహ్వానం – సీఎం చంద్రబాబు ఢిల్లీ భేటీ

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి మోదీకి ఆహ్వానం – సీఎం చంద్రబాబు ఢిల్లీ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎం స్వయంగా ప్రధానిని ఆహ్వానించినట్లు సమాచారం.

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా పాల్గొని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాముఖ్యతను వివరించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమని వారు ప్రధానిని ఆకర్షించారు.

ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించేందుకు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రజా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అదనంగా నాన్-క్యాడర్ అధికారులను కూడా నియమించి ఏర్పాట్లను వేగవంతం చేశారు.

విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసుకున్న ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఉత్తరాంధ్రకు అభివృద్ధి ద్వారంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు తర్వాత జరిగిన అభివృద్ధి తరహాలోనే ఈ ప్రాంతం కూడా వేగంగా ఎదుగుతుందని అంచనా.

ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వాణిజ్యం, పర్యాటకం రంగాలకు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిలిపేలా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది.

also read: అరెస్టు భయంతో శవపేటిక కొనుగోలు చేసి “చనిపోయినట్లు” నాటకం… చివరికి…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు