ఉత్తర, తూర్పు భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలుచోట్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలు చోటుచేసుకుని ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో కలిపి కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రజౌరీ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు ఉద్ధృతంగా ప్రవహించాయి. ఈ ఘటనల్లో పలువురు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరోవైపు నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో వరదలు తీవ్రంగా ప్రభావం చూపి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.
also read: త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ అనుమానాస్పద మృతి.. ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభం