-
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం
-
పక్కా వ్యూహంతో కసరత్తు ప్రారంభించిన కేంద్రం
-
ఈసారి కచ్చితంగా ఆమోదం పొందే అవకాశం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: మరోసారి నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బలమైన చర్చ నడుస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట మహిళా బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ మూడింట రెండో వంతు మద్దతు లేకపోవడంతో మహిళా బిల్లు వీగిపోయింది. దీంతో డి లిమిటేషన్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఆ రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముంగిటకు తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
20 నుంచి పార్లమెంట్ సమావేశాలు…
Also Read:కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్.. సియా కుటుంబ దుకాణానికి ఫుడ్ సేఫ్టీ నోటీసులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు వారాలకు పైగా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలతో.. పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఎన్డీఏ సాధించింది. ఇంకా కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ రెండు బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
పెరిగిన ఎంపీల బలం…
Also Read:పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో భక్తుడి మృతి
పశ్చిమ బెంగాల్లో రాజకీయం పూర్తిగా బిజెపి చేతుల్లోకి వచ్చింది. అక్కడ అధికారం చేపట్టిన బిజెపి వైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. 20 మంది టీఎంసీ ఎంపీలు వేరుశెబిరం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కు మద్దతు ప్రకటించారు. మరోవైపు శివసేన షిండే వర్గంలో ఒక ఆరుగురు ఎంపీలు చేరారు. అటు శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సిపి ఎంపీలు సైతం ఎన్డీఏకు మద్దతు తెలిపేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో కీలక బిల్లుల ఆమోదానికి అడ్డంకులను తొలగించుకుని.. తమకు కావాల్సింది ఆమోదం చేయించుకోవడానికి బిజెపి పట్టుదలతో ఉంది.
కీలక బిల్లుల ఆమోదం…
Also Read:కలహాల కాంగ్రెస్…! తెలంగాణ అధికార పార్టీలో శృతిమిస్తున్న విభేదాలు…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులతో సహా పలు కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు ఢిల్లీ వర్గాలు గట్టి ప్రయత్నంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ పై 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రతిపాదిత సవరణలతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సవరించిన బిల్లులో లోక్సభ, రాష్ట్ర శాసనసభల సంఖ్యాబలాన్ని 50 శాతం పెంచే నిబంధన ఉండవచ్చని చెబుతున్నారు. ఆపై 30 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్న పక్షంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్న నిబంధన కూడా 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించే అవకాశం ఉంది. అన్నింటికంటే కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.