Homeఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ బరిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు

అసెంబ్లీ బరిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు

•వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ
•రాష్ట్ర మంత్రివర్గంలో చేరే ఛాన్స్
•రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :- 

ఏపీ రాజకీయాల్లో కొన్ని కుటుంబాలది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఆ కుటుంబాలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తూ వస్తున్నాయి. అటువంటి వారిలో కింజరాపు ఫ్యామిలీ ఒకటి. కింజరాపు ఎర్రం నాయుడు వారసత్వంగా రాజకీయాలు చేస్తోంది ఆ కుటుంబం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే నెంబర్ టు గా ఎదిగింది ఆ కుటుంబం. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా, సోదరుడు అచ్చెనాయుడు రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కుటుంబానికి కూడా ఇవ్వనంత ప్రాధాన్యత చంద్రబాబు కింజరాపు ఫ్యామిలీకి ఇస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చేర్పులు మార్పులు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

తండ్రి అకాల మరణంతో..
కింజరాపు ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు. కనీసం అప్పటి వరకు ఎర్రం నాయుడుకు ఒక కుమారుడు ఉన్నాడన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఎప్పుడైతే ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారో.. ఆయన వారసుడిగా రామ్మోహన్ నాయుడు తెరపైకి వచ్చారు. మంచి వాగ్దాటితో.. మంచి చరిష్మతో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్లో కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ తర్వాత యువనేతల్లో అత్యంత ప్రజాదరణ, ప్రాచుర్యం పొందిన నేతగా గుర్తింపు సాధించారు కింజరాపు రామ్మోహన్ నాయుడు.

నరసన్నపేట నుంచి పోటీ..
అయితే ఈసారి కింజరాపు ఫ్యామిలీ నుంచి చేర్పులు మార్పులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా కింజరాపు అచ్చం నాయుడు పార్టీ పగ్గాలు తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి ఆయన కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి రాష్ట్ర క్యాబినెట్లో చేరుతారు అన్నది శ్రీకాకుళం పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. నియోజకవర్గాల పునర్విభజన తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. జిల్లా నుంచి ఏదైనా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రామ్మోహన్ నాయుడు పోటీ చేయడం ఖాయమని ప్రచారం సాగుతోంది. అవసరం అనుకుంటే నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు బరిలో దిగుతారని కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ టీం లో భాగంగా.. రామ్మోహన్ నాయుడు కు ఛాన్స్ దక్కుతుందని సమాచారం. అయితే శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కింజరాపు కుటుంబానికి పట్టు ఉంది. ఒకవేళ రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ బరిలో దిగితే.. అదే ఫ్యామిలీ నుంచి మరొకరికి ఎంపీగా ఛాన్స్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు