క్రైమ్ మిర్రర్, వైరల్ :- దక్షిణాది స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చిన ఆమె అమెరికాలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి అందమైన ప్రదేశాల్లో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వరుసగా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రాలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.వెకేషన్లో క్యాజువల్ లుక్‌లో కనిపించిన ఐశ్వర్య రాజేష్ స్టైలిష్‌గా మెరిశారు. ప్రకృతి అందాల మధ్య దిగిన ఫొటోలతో పాటు, ఓ రెస్టారెంట్లో పెద్ద గ్లాస్లో జ్యూస్ తాగుతూ తీసుకున్న ఫొటో కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇదే ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది.ఆ ఫొటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పిన ప్రసిద్ధ డైలాగ్‌ను గుర్తు చేస్తూ, కంచం ఏంటి అంత ఉంది? అనే డైలాగ్‌ను మార్చి అదేంటి… అంత ఉంది? అంటూ మీమ్స్, కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు జ్యూస్ గ్లాస్ కంటే కామెంట్లే ఎక్కువ వచ్చేశాయి అంటూ సరదాగా స్పందిస్తున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్ 350 బైక్ యజమానులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా గేర్ సెన్సార్ ఫిక్స్ చేయనున్న కంపెనీ!
సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోలు వైరల్ కావడం కొత్త విషయం కాకపోయినా, చిన్న అంశాలనే నెటిజన్లు హాస్యంగా మార్చి ట్రెండ్ చేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. ఐశ్వర్య రాజేష్ తాజా వెకేషన్ ఫొటోలు కూడా అదే తరహాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే, ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, మహిళా ప్రధాన చిత్రాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.వెకేషన్లో రిలాక్స్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ త్వరలోనే మళ్లీ షూటింగ్లలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈలోగా ఆమె షేర్ చేస్తున్న ట్రావెల్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే నిరాహార దీక్ష, పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం